ఆటో కార్మికులు బాగానే ఉన్నారు.. అన్ని డ్రామాలే - రేవంత్ రెడ్డి
కిరాయి పైసలు సంపాదించుకోలేక, సంసారం నడిపించుకోవడంలో ఇబ్బంది ఉన్న ఆటో కార్మికులు ఆటో తగలబెడతారా అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఆటో డ్రైవర్ల సమస్య అసెంబ్లీని కుదిపేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోలో వచ్చిన విషయం తెలిసిందే. ఇక సభలోనూ ఆటో కార్మికుల సమస్యలపై చర్చ జరిగింది. ఆటో కార్మికుల సమస్యలు బీఆర్ఎస్ నేతలు లేవనెత్తారు. వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలని ఆదుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలన్నారు.
అయితే ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రస్తావించిన బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆటో కార్మికులు బాగానే ఉన్నారని.. బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు రేవంత్. ఇటీవల ప్రజా భవన్ ముందు ఓ ఆటోను తీసుకువచ్చి బీఆర్ఎస్ నేతలె తగలబెట్టారన్నారు రేవంత్.
మీ ఆనవాళ్లు లేకుండా చేసే భాద్యత నాది - సీఎం రేవంత్ రెడ్డి. pic.twitter.com/pmhrHNyoK2
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2024
కిరాయి పైసలు సంపాదించుకోలేక, సంసారం నడిపించుకోవడంలో ఇబ్బంది ఉన్న ఆటో కార్మికులు ఆటో తగలబెడతారా అని ప్రశ్నించారు. ఆటోకు ఎన్ని డబ్బులు అవసరమవుతాయన్నారు. ఆటోలో కేటీఆర్ ప్రయాణించడంపైనా రేవంత్ సెటైర్లు వేశారు. ఆటో రాముడు ఆటోలో తిరిగాడని, లోపల కెమెరాలు పెట్టించి వీడియోలు తీసి డ్రామాలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు రేవంత్.