మేడారం వెళ్తున్నారా.. అయితే ఆధార్ తీసుకెళ్లండి
మేడారం జాతర అనగానే గుర్తొచ్చేది బంగారం (బెల్లం). మేడారం వెళ్లిన భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడం ఆనవాయితీ.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ జాతర. రెండేండ్లకోసారి జరిగే ఈ జాతరకు లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఇక తెలంగాణలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. జాతరను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసింది. మేడారంలో ఏర్పాట్లను మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క పర్యవేక్షిస్తున్నారు.
మేడారం జాతర అనగానే గుర్తొచ్చేది బంగారం (బెల్లం). మేడారం వెళ్లిన భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడం ఆనవాయితీ. బరువుకు సరితూగే బంగారాన్ని దేవతలకు సమర్పిస్తారు. అయితే తాజాగా ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారంలో బంగారం (బెల్లం) సమర్పించే వారి వివరాలు ఫోన్ నంబర్, చిరునామా, ఆధార్ నంబర్ సేకరించాలని స్థానిక బెల్లం వ్యాపారులను ఆదేశించింది. ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించే భక్తులు ఫోన్ నెంబర్, ఆధార్ వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశాలు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఇక మేడారం జాతర కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర జరగనుంది.