తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం
అడ్డుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు.. పరిస్థితి ఉద్రిక్తం
BY Naveen Kamera30 Sept 2024 3:04 PM IST

X
Naveen Kamera Updated On: 30 Sept 2024 3:04 PM IST
బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ (తెలంగాణ భవన్) ముట్టడించేందుకు సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. వారిని బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు పార్టీల నాయకులు పరస్పరం తోసేసుకోవడంతో కొందరు కిందపడ్డారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖను సన్మానిస్తున్న ఫొటోను కొందరు బీఆర్‌ఎస్ నాయకులు ట్రోల్ చేస్తున్నారని, కొండా సురేఖకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. మహిళ మంత్రిని ట్రోల్ చేస్తున్నందుకు పార్టీ పెద్దలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Next Story