Telugu Global
Telangana

జార్ఖండ్‌ డీజీపీపై వేటు

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే పదవి నుంచి తొలిగించాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

జార్ఖండ్‌ డీజీపీపై వేటు
X

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే పదవి నుంచి తొలిగించాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సీనియారిటీ ఉన్న అధికారిని వెంటానే తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని తెలిపింది. ఈ ఆర్డర్స్ తక్షణమే అమలులోకి రావాలని సాయంత్రం 7 గంటల లోపు తన నివేదికను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్టు తెలుస్తోంది.

గత ఎలక్షన్స్‌లో అనురాగ్ గుప్తాపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పక్ష పాతిగా వ్యవహరిస్తున్నట్టు పలువురు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈసీకి పలు ఫిర్యాదులు అందాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

First Published:  19 Oct 2024 3:57 PM IST
Next Story