Telugu Global
Telangana

హైదరాబాద్ లో దారుణం: మహిళ గొంతుకోసి, చేయివిరిచిన యువకుడు!

హైదరాబాద్ లో... ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ యువకుడు వివాహితపై దాడికి దిగాడు. తన కోరిక తీర్చనందుకు ఆమె గొంతుకోసి పరారయ్యాడు. ఆ యువకుడు గతంలో ఓ ఎమ్మెల్యేకు పీఏ గా పని చేసినట్టు సమాచారం.

హైదరాబాద్ లో దారుణం: మహిళ గొంతుకోసి, చేయివిరిచిన యువకుడు!
X

హైదరాబాద్ లో ఓ వివాహితను తన కోరిక తీర్చాలంటూ వేధించి ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు కోసి పరారయ్యాడు ఓ యువకుడు.

రాజ్ భవన్ రోడ్డులోని బీఎస్ మక్తాలో సూరజ్ అతని భార్య నివాసముంటారు. ఆమెకు ఫేస్ బుక్ లో విజయ సింహా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో అతను ఆ మహిళను వేధించడం మొదలుపెట్టాడు.విజయ్,న్యూడ్ కాల్స్ చేసి మహిళను వేధించడం మొదలు పెట్టాడు.ఆమె అడ్రస్ తెలుసుకొని ఇంటి కొచ్చి తనతో రావాలని , తన కోరిక తీర్చాలని బెధిరించాడు. ఆమె వ్యతిరేకించడంతో బీరు బాటిల్ పగుల గొట్టి ఆమె గొంతు కోశాడు. చేయి విరిచేశాడు. ఆమె అరుస్తుండటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తన భార్య చెప్పిందని సూరజ్ చెప్తున్నాడు.

ఈ దాడి జరిగిన సమయంలో మహిళ భర్త సూరజ్ ఇంటి వద్ద లేడు. ఆమె ఫోన్ చేయగానే భర్త వచ్చి ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చాడు. తీవ్రంగా గాయపడిన మహిళకు ప్రస్తుతం డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.

మహిళపై దాడి చేసిన విజయసింహా గతంలో ఓ ఎమ్మెల్యే దగ్గర పీఏ గా పని చేసినట్టు సమాచారం. అతనికి పెద్ద పెద్ద నాయకులతో పరిచాయాలున్నాయని, అందువల్ల తమకు అతని నుండి ప్రాణహాని ఉందని మహిళ భర్త సూరజ్ ఆందోళన వ్యక్తం చేశాడు.

First Published:  19 Sept 2022 8:45 AM IST
Next Story