Telugu Global
Telangana

తెలంగాణ ఎన్నికలపై ఆత్మసాక్షి సర్వే..

ఓటింగ్ శాతం పరంగా చూస్తే 2018లో బీఆర్ఎస్‌కు 46.8 శాతం రాగా.. ఈ సారి 42.5 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ 2018లో 28.43 శాతం ఓట్ షేర్ సాధించగా.. ఈ సారి 36.5 శాతానికి పెరుగుతుందని సర్వే వెల్లడించింది.

తెలంగాణ ఎన్నికలపై ఆత్మసాక్షి సర్వే..
X

తెలంగాణ ఎన్నికలపై ఆత్మసాక్షి సర్వే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు బీఆర్ఎస్‌.. అటు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తామంటూ ఎవ‌రికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వేలు సైతం పొలిటికల్‌ హీట్ మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు తమ ఫలితాలు వెల్లడించగా.. తాజాగా ఆత్మసాక్షి తన సర్వే వివరాలను రిలీజ్ చేసింది.

ఆత్మసాక్షి సర్వేలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని తేల్చింది. బీఆర్ఎస్ దాదాపు 64 నుంచి 70 స్థానాలు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. కాంగ్రెస్ గతం కంటే పుంజుకుని 37 నుంచి 43 స్థానాలు సాధిస్తుందని తేల్చింది. ఇక బీజేపీ 5 నుంచి 6 స్థానాలు, MIM 6 నుంచి 7 స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది.

ఇక ఓటింగ్ శాతం పరంగా చూస్తే 2018లో బీఆర్ఎస్‌కు 46.8 శాతం రాగా.. ఈ సారి 42.5 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ 2018లో 28.43 శాతం ఓట్ షేర్ సాధించగా.. ఈ సారి 36.5 శాతానికి పెరుగుతుందని సర్వే వెల్లడించింది. బీజేపీ 10.75 శాతం ఓట్లు సాధిస్తుందని వివరించింది.


ప్రధానంగా ఆరు స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉంటుందని అంచనా వేసింది. ఈ 6 స్థానాల్లో మూడు స్థానాల్లో బీఆర్ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్‌, మరో స్థానంలో బీజేపీ లీడ్‌లో ఉంటాయని తెలిపింది.

First Published:  30 Oct 2023 10:32 AM IST
Next Story