ఆహ్వాన పత్రికలో అట్టడుగున.. కేసీఆర్‌కు అవమానం!
గౌరవ అతిథులుగా స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు ముద్రించారు. మాజీ సీఎం కేసీఆర్ పేరును గౌరవ అతిథుల జాబితాలో చివరి నుంచి ఐదో స్థానంలో కె.చంద్రశేఖర్ రావు, గజ్వేల్ శాసన సభ్యులు అని ముద్రించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానిస్తూ మెదక్ జిల్లా అధికారులు విడుదల చేసిన ఆహ్వాన పత్రిక చర్చనీయాంశమైంది. ఈ ఆహ్వాన పత్రికలో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ పేరును చిట్ట చివరన రాయడం వివాదానికి దారి తీసింది. దీనిపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదంటూ ట్వీట్ చేసింది.
సిగ్గు, సిగ్గు!
— BRS Party (@BRSparty) August 14, 2024
దిగజారుడుతనంలో పరాకాష్టకు చేరుకున్న కాంగ్రెస్.
తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి పేరుని ఆహ్వాన పత్రికలో చివర్లో పెట్టి తమ కుంచిత స్వభావాన్ని మరొక్కసారి బయపెట్టుకున్న రేవంత్ సర్కార్.
ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ..… pic.twitter.com/uASLXKU3NJ
ఇంతకీ వివాదం ఏంటంటే!
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఓ ఆహ్వాన పత్రికను రిలీజ్ చేశారు అధికారులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.కేశవరావు, విశిష్ట అతిథులుగా మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ పేర్లు ప్రముఖంగా ముద్రించారు. గౌరవ అతిథులుగా స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు ముద్రించారు. మాజీ సీఎం కేసీఆర్ పేరును గౌరవ అతిథుల జాబితాలో చివరి నుంచి ఐదో స్థానంలో కె.చంద్రశేఖర్ రావు, గజ్వేల్ శాసన సభ్యులు అని ముద్రించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పేరు చివర్లో పెట్టడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ ట్వీట్ ఇదే!
దిగజారుడుతనంలో కాంగ్రెస్ పరాకాష్టకు చేరుకుందని ట్వీట్ చేసింది బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పేరుని ఆహ్వాన పత్రికలో చివర్లో పెట్టి రేవంత్ సర్కార్ తన కుంచిత స్వభావాన్ని మరొక్కసారి బయపెట్టుకుందని బీఆర్ఎస్ మండిపడింది. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ.. ఆహ్వాన పత్రికలో ఎంపీలు, ఎమ్మెల్సీల తర్వాత కేసీఆర్ పేరును చేర్చిందని ఫైర్ అయింది. దుష్ట కాంగ్రెస్ వింత చేష్టలు, విపరీత బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో జవాబు చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.