Telugu Global
Telangana

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్-సైన్స్, హెల్త్‌కేర్ ఈవెంట్, బయోఏషియా 2023, హైదరాబాద్ లో ఈరోజే ప్రారంభం

ఈ కార్యక్రమం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఆసియాలోనే అతిపెద్ద లైఫ్-సైన్స్ అండ్ హెల్త్‌కేర్ ఫోరమ్ ఏర్పాటు చేస్తున్న‌ ఈ ఈవెంట్, కరోనా తర్వాత మొదటి సారి తెలంగాణలో నిర్వహించబడుతున్న‌ది.

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్-సైన్స్, హెల్త్‌కేర్ ఈవెంట్, బయోఏషియా 2023, హైదరాబాద్ లో ఈరోజే ప్రారంభం
X

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మార్క్యూ హెల్త్‌కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ ఈవెంట్ బయోఏషియా 2023, 20వ ఎడిషన్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

ప్రభుత్వ ప్రముఖులు, 2,500 మందికి పైగా పరిశ్రమాధిపతులు, పరిశోధకులు, 50 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్‌లో ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్: షేపింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్’ అనే థీమ్ పై చర్చ జరుగుతుంది. థీమ్, 'వన్ హెల్త్: ఇంటిగ్రేటింగ్ క్రాస్ సెక్టోరల్ ఎకోసిస్టమ్స్ టు ఫ్యూచర్డ్ ఫ్యూచర్'; 'ఆరోగ్య సంరక్షణను అందించడానికి డేటా, అనలిటిక్స్, AI , బ్లాక్‌చెయిన్ వంటి సాంకేతికతలను ఉపయోగించడం'; 'ఈక్విటీ: డ్రైవింగ్ యాక్సెసిబిలిటీ, అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ', తదితర సదస్సులు జరుగుతాయి. సమావేశాలలో 800కి పైగా కార్పొరేట్ కంపెనీలు, 70 కంటే ఎక్కువ మంది ప్రముఖ వక్తలు పాలొంటారు.

ఈ కార్యక్రమం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఆసియాలోనే అతిపెద్ద లైఫ్-సైన్స్ అండ్ హెల్త్‌కేర్ ఫోరమ్ ఏర్పాటు చేస్తున్న‌ ఈ ఈవెంట్, కరోనా తర్వాత మొదటి సారి తెలంగాణలో నిర్వహించబడుతున్న‌ది. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం పరిమాణాన్ని ప్రస్తుత $50 బిలియన్ల నుండి $100 బిలియన్లకు రెట్టింపు చేయాలని, రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో పనిచేస్తున్న వర్క్ ఫోర్స్ ను నాలుగు లక్షల నుండి ఎనిమిది లక్షలకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం.

పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాటల్లో చెప్పాలంటే... బయోఏషియా, గత 20 సంవత్సరాలుగా హెల్త్‌కేర్ కీలక అవసరాలపై ప్రపంచ నాయకులకు చర్చించడానికి ఒక వేదికను అందిస్తోంది. హెల్త్‌కేర్ రంగంలో వన్ హెల్త్ విధానాన్ని అమలు చేస్తున్న‌ది.

First Published:  24 Feb 2023 7:31 AM IST
Next Story