Telugu Global
Telangana

శ్రద్ధా వాకర్ హత్య కేసును హిందూ-ముస్లిం సమస్యగా ఎందుకు మారుస్తున్నారు.. - అసదుద్దీన్ ఒవైసీ

దేశంలో ఇటీవల జరిగిన హత్యలు, శ్రద్ధా హత్య కేసుతో పాటు అజంగఢ్ హత్యలను కూడా హిందూ-ముస్లిం సమస్యగా మార్చవద్దని, ఇటువంటి దారుణమైన నేరాల‌ను ఖండించాలని అన్నారు.

శ్రద్ధా వాకర్ హత్య కేసును హిందూ-ముస్లిం సమస్యగా ఎందుకు మారుస్తున్నారు.. - అసదుద్దీన్ ఒవైసీ
X

ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య క్రూర‌మైన నేర‌మ‌వ‌డంతో సంచ‌ల‌న‌మై వార్త‌ల్లో ప్రాధాన్యం సంత‌రించుకుంది. దీనిపై రాజ‌కీయ నాయ‌కులు కూడా త‌మ‌దైన కోణంలో విమ‌ర్శిస్తున్నారు. బీజేపీ ల‌వ్ జిహాద్ కోణంలో చూస్తుండ‌గా విప‌క్ష నేత‌లు మాత్రం మ‌తాతీతంగా ప‌రిగ‌ణిస్తున్నారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. దేశంలో ఇటీవల జరిగిన హత్యలు, శ్రద్ధా హత్య కేసుతో పాటు అజంగఢ్ హత్యలను కూడా హిందూ-ముస్లిం సమస్యగా మార్చవద్దని, ఇటువంటి దారుణమైన నేరాల‌ను ఖండించాలని అన్నారు. మెహ్రౌలీలో శ్రద్ధా వాకర్‌ను హత్య చేయడం ఘోరమైన నేరమని, అయితే అది హిందూ-ముస్లింల మ‌ధ్య సమస్య కాకూడదని ఒవైసీ అన్నారు. ఇటీవల అజంగఢ్‌లో హిందూ యువకుడు తన ప్రియురాలిని హత్య చేసిన ఘటనను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. హేయ‌మైన ఇటువంటి నేరాల‌ను తీవ్రంగా ఖండించాలి. మ‌హిళ‌ల‌పై దారుణాల‌కు ఒడిగ‌డుత‌న్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌తీ రోజూ ఏదో చోట ఇటువంటి దారుణ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇటువంటి వాటిని హిందు-ముస్లింల స‌మ‌స్య‌గా ఎందుకు మారుస్తున్నార‌ని ఒవైసీ ప్ర‌శ్నించారు.

ఇదిలా ఉండ‌గా.. శ్రద్ధా వాకర్ హత్య కేసు గుజరాత్ ఎన్నికలు, 2022 ఢిల్లీ మునిసిప‌ల్ ఎన్నికలలో ప్రధాన అస్త్రంగా మారింది, ఇక్కడ బీజేపీ అభ్యర్థులు శ్ర‌ద్ధా హత్యను 'లవ్ జిహాద్'గా అభివర్ణించారు ఇటువంటి దారుణాల‌కు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

First Published:  22 Nov 2022 6:06 AM GMT
Next Story