కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించగానే, ట్విట్టర్లో ట్రెండింగ్ అయిన 'తెలంగాణ'
తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో తెలంగాణ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. తెలంగాణతో పాటు BRS, TRS, కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ లు కూడా ట్రెండ్ అయ్యాయి.
ఈ రోజు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్
జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా సోషల్ మీడియాలో తెలంగాణ, BRS, TRS, కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అయ్యాయి. నెటిజనులు కేసీఆర్ కువిషెస్ చెప్తూ బీఆరెస్ విజయవంతం కావాలని ఆశించారు.
''TRS తెలంగాణను అభివృద్ది చేసిన విధంగా BRS దేశాన్ని అభివృద్ధి చేస్తుందని ఆశిస్తున్నాను.'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా "భారతదేశాన్ని మార్చడానికి, అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి నడుం భిగించిన KCR కు స్వాగతం" అని మరొకరు రాశారు.
ఒక్క తెలుగు వాళ్ళ నుంచే కాకుండా కేసీఆర్ బీఆరెస్ కు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అనేక ప్రాంతాల నుంచి సోషల్ మీడియాలో బీఆరెస్ కు స్వాగతం పలుకుతూ కామెంట్లు చేశారు నెటిజనులు.
TRS fought for 21 years to See Telangana Development
— Prabhakar Goud Kurmindla (@PrabhakarGoud_K) October 5, 2022
BRS will fight for Future of Bharath.
"Bold-Rebel-Sacrifice"
Success = KCR pic.twitter.com/UI0Q2M0BhE
Very bold decision by KCR sab to form a National party BRS. It's proud movement to Telangana people whose responsibility to support https://t.co/UTxSMajC3Q
— P Upendra (@p_pupendra) October 5, 2022
The nation is looking up to KCR!
— Thunga Balu-TRS (@thungabalu) October 5, 2022
యావత్ దేశం చూపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వైపు.... కొత్త శకం కోసం...దేశ అభివృద్ధి కోసం దేశ్ కి నేత కేసిఆర్ గారిచే TRS పార్టీ @trspartyonline ని BRS BHARAT RASHTRA SAMITI గా తీర్మానం..
జై భారత్...జై తెలంగాణ... జై కేసిఆర్ @KTRTRS pic.twitter.com/xgQRO6Grkr