Telugu Global
Telangana

మంచి ప్రతిపక్షంగా విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తాం

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ పనిని కూడా కక్షపూరితంగా చేయడం లేదన్న మంత్రి పొంగులేటి

మంచి ప్రతిపక్షంగా విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తాం
X

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ పనిని కూడా కక్షపూరితంగా చేయడం లేదన్నారు. గత ప్రభుత్వంలోని నేతలు చేసిన అక్రమాలపై చట్టపరంగానే చర్యలుంటాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిదిద్దుతున్నదని మంత్రి అన్నారు. సెక్రటేరియట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమగ్ర ఇంటింటి సర్వేపై బీఆర్‌ఎస్‌ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. క్షేత్ర స్థాయి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ సర్వేను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదారుడికి చేరవేయడం కోసమే సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు.మంచి ప్రతిపక్షంగా విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. ఎంతో దూరదృష్టితో ఈ ప్రభుత్వం సర్వేను చేపట్టింది. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బైట పెట్టలేదని ప్రశ్నించారు


First Published:  18 Nov 2024 10:26 PM IST
Next Story