Telugu Global
Telangana

పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై ఆర్య వైశ్య సంఘాలు ఆగ్రహం

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చడంపై ఆర్యవైశ్య స్టేట్ ప్రెసిడెంట్ అమరవాది లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు.

పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై ఆర్య వైశ్య సంఘాలు ఆగ్రహం
X

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చడంపై తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరాలోచన చేయాలని ఆర్యవైశ్య స్టేట్ ప్రెసిడెంట్ అమరవాది లక్ష్మీనారాయణ తెలిపారు. శ్రీరాములు ఏ ప్రాంతానికో.. రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. భారత దేశం గర్వించదగ్గ నాయకుడు అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని మహాత్మా గాంధీజీ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెట్టారని, కానీ ఇప్పుడు మార్చడం సరికాదన్నారు.

తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టి గౌరవించుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఆయనను గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం సరికాదన్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మారుస్తూ నిన్న తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే

First Published:  21 Sept 2024 11:36 AM GMT
Next Story