లిక్కర్ కేసులో నాపై ఆధారాలుంటే నన్ను అరెస్టు చేయండి... కవిత సవాల్
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ తో మాట్లాడిన కవిత, దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ సర్కార్ పై కేసీఆర్ యుద్దం చేస్తున్నారు కాబట్టి ఆయనపై కక్ష తీర్చుకోవడానికి కేసీఆర్ కూతురునైన తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో తన పాత్ర ఉందని, తనను అరెస్టు చేస్తారని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. నిజంగానే ఆ కేసులో తన పాత్రపై ఆధారులుంటే అరెస్టు చేయాలని కవిత సవాల్ విసిరారు.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ తో మాట్లాడిన కవిత, దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ సర్కార్ పై కేసీఆర్ యుద్దం చేస్తున్నారు కాబట్టి ఆయనపై కక్ష తీర్చుకోవడానికి కేసీఆర్ కూతురునైన తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.
దేశంలో తనకు చాలా మంది స్నేహితులున్నారని, వాళ్ళు చేసే వ్యాపారాలతో, వ్యవహారలతో తనకేం సంబంధం అని కవిత ప్రశ్నించారు. తాను వారితో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బీజేపీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కవిత మండిపడ్డారు.
సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా ఉంటుందని తాను భావించడంలేదని, ఆ సంస్థ బీజేపీ చెప్పుచేతుల్లో నడుస్తోందని కవిత ఆరోపించారు. సీబీఐ ఒక వేళ అబద్దపు ఆరోపణలతొ తనపై చర్యలు తీసుకుంటే తాను కోర్టులో పోరాడుతానని కవిత స్పష్టం చేశారు.