Telugu Global
Telangana

నాందేడ్ బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భకు ముమ్మర ఏర్పాట్లు

Nanded BRS Meeting | ఖమ్మంలో వచ్చిన ప్రజలకన్నా ఎక్కువ మందిని ఈ సభకు రప్పించాలని బీఆరెస్ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాల పట్ల ఉన్న క్రేజ్ వల్ల‌ ఆ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున జనం వస్తారని బీఆరెస్ నాయకత్వం భావిస్తోంది.

Nanded BRS Meeting | నాందేడ్ బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భకు ముమ్మర ఏర్పాట్లు
X

Nanded BRS Meeting | నాందేడ్ బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భకు ముమ్మర ఏర్పాట్లు

Nanded BRS Meeting | భారత రాష్ట్ర సమితి మొదటి బహిరంగ సభ ఖమ్మంలో విజయవంతం అయిన నేపథ్యంలో అదే ఊపుతో రెండవ బహిరంగ సభ మహారాష్ట్రలో నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 5వ తేదీన నాందేడ్ లో జరగనున్న ఆ సభ ను బీఆరెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఖమ్మంలో వచ్చిన ప్రజలకన్నా ఎక్కువ మందిని ఈ సభకు రప్పించాలని బీఆరెస్ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాల పట్ల ఉన్న క్రేజ్ వల్ల‌ ఆ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున జనం వస్తారని బీఆరెస్ నాయకత్వం భావిస్తోంది. అంతే కాక ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల నుండి కూడా జ‌నం పెద్ద ఎత్తున వస్తారని బీఆరెస్ నాయకులు భావిస్తున్నారు.

నాందేడ్ స‌భ స‌న్నాహ‌కాల్లో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శ‌నివారం నాందేడ్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. అప్పారావు పేట్, షివిని, ఇస్లాపూర్, హిమాయ‌త్ న‌గ‌ర్ గ్రామాల్లో విస్త్రుతంగా పర్యటించారు. స్థానికులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.


మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తమను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఫించ‌న్లు కూడా రావ‌డం లేద‌ని, రోడ్లు సరిగా లేవని, గ్రామాల అభివృద్ది అంతంత మాత్రంగానే ఉందని, ఉండటానికి పేదలకు ఇళ్ళు కూడా లేవని, ఎలాంటి సౌకర్యాలకు తాము నోచుకోవడం లేదని స్థానికులు ఇంద్రకరణ్ రెడ్డితో మొరపెట్టు కున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో అమ‌లవుతున్న ప‌థ‌కాల‌ను తమ‌క్కూడా అమ‌లు చేయాల‌ని అక్కడి ప్రజలు కోరారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ త‌ర‌హాలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించార‌ని వాళ్ళకు చెప్పిన మంత్రి నాందేడ్ స‌భ‌కు భారీగా త‌ర‌లి వ‌చ్చి విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

మరో వైపు నాందేడ్ సభ ఏర్పాట్లను ఈ రోజు బీఆరెస్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్, జోగు రామ‌న్న‌, హ‌న్మంత్ షిండే, సివిల్ సప్ల‌యి కార్పొరేష‌న్ చైర్మ‌న్ ర‌వీంద‌ర్ సింగ్ తదితరులు ప‌రిశీలించారు.

వీరితో పాటు నాందేడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు కూడా పాల్గొన్నారు.

ఈ సభలో కేసీఆర్ సమక్షంలో పెద్ద ఎత్తున మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్‌లో చేరుతారని బీఆరెస్ నాయకులు చెప్తున్నారు. .

First Published:  28 Jan 2023 7:00 PM IST
Next Story