Telugu Global
Telangana

తెలంగాణలో ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ లు

లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేసేందుకు ఈ-కేవైసీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. నిమ్స్‌ స్పెషల్‌ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహించాలని చెప్పారు మంత్రి హరీష్ రావు.

తెలంగాణలో ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ లు
X

తెలంగాణలో ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ ల పంపిణీకి రంగం సిద్ధమైంది. లబ్ధిదారుడికి సంబంధించిన సమాచారమంతా ఆ కార్డులో నిక్షిప్తం అవుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే పేరు, ఇతర వివరాలన్నీ కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమవుతాయి. ఆ కార్డ్ తెచ్చింది లబ్ధిదారుడేనా లేదా అనేది ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా కనిపెట్టొచ్చు. అధునాతన డిజిటల్ కార్డ్ లతో ప్రజలకు మరింత భరోసా లభిస్తుందని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పై ఆయన సమీక్ష నిర్వహించారు.

వైద్యసేవల పరిమితి పెంపు..

ఇప్పటి వరకు తెలంగాణలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవల పరిమితి 2లక్షల రూపాయల వరకు ఉండేది. ఇప్పుడది రూ.5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిజిటల్ కార్డ్ లతోపాటు పరిమితి పెంపు కూడా అమలులోకి వస్తుంది.

త్వరలో పంపిణీ..

లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేసేందుకు ఈ-కేవైసీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. నిమ్స్‌ స్పెషల్‌ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహించాలని చెప్పారు మంత్రి హరీష్ రావు. బయోమెట్రిక్‌ విధానంలో ఆరోగ్యశ్రీ రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఫేస్‌ రికగ్నైజేషన్‌ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆన్‌ లైన్‌ పర్యవేక్షణతో డయాలసిస్‌ సేవలు మరింత నాణ్యంగా అందుతాయన్నారు. కరోనా సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీలు విజయవంతంగా నిర్వహించిన కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకంగా ఇవ్వాలని సమీక్షలో మంత్రి హరీష్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మూగ, చెవిటి పిల్లలకు కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో దవాఖానలో ప్రభుత్వం ఉచితంగా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు నిర్వహిస్తోంది. ఇకపై ఈ సేవలను వరంగల్‌ ఎంజీఎం లో కూడా అందుబాటులోకి తేవాలని ఆరోగ్యశ్రీ బోర్డు నిర్ణయించింది.

First Published:  19 July 2023 6:19 AM IST
Next Story