Telugu Global
Telangana

రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది మీకు మాత్రమేనేమో!

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పోస్ట్‌

రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది మీకు మాత్రమేనేమో!
X

రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది మీకు మాత్రమేనేమో! మీ సోదరుడి బల్‌డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి! అంటూ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పోస్ట్‌ పెట్టారు. అనుముల తిరుపతి రెడ్డి గారు! ఎల్‌కేజీ చదవే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల కిందట కొన్న ఇళ్లు నేల మట్టమయ్యాయి. వారం ముందు గృహ ప్రదేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా పేకమేడల కూల్చివేశారు.

తిరుపతిరెడ్డి గారు.. క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు. వాల్టా అనుకుంటా ఏకంగా మీకు 30 రోజుల సమయం ఇచ్చింది. కోర్టులో స్టే సంపాదించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో! మీ సోదరుడి బల్‌డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి! అంటూ కేటీఆర్‌ రాసుకొచ్చారు. బ్రదర్‌ భద్రం.. బడుగులు ఛిద్రం అంటూ పత్రికా కథనాన్ని కేటీఆర్‌ ట్వీట్‌తో జత చేశారు.

తెలంగాణ బిడ్డకు అన్యాయం చేసేలా జీవో 33: కేటీఆర్‌

ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో జాప్యం కేటీఆర్‌ స్పందించారు.తెలంగాణ బిడ్డకు అన్యాయం చేసేలా జీవో 33 తెచ్చాని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ సర్కార్‌ వైద్య విద్య ప్రవేశాలు చేసేది ఎప్పుడు? ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు డెడ్‌లైన్‌ సమీపిస్తున్నా.. ఈ డైలమాకు తెరదించేదెప్పుడు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వచ్చిన మొదటి ఏడాదే ప్రవేశాల్లో ఎందుకింత అస్తవ్యస్థం అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రవేశాల ప్రక్రియ ప్రశాంతంగా సాగేదన్నారు.

First Published:  24 Sept 2024 11:30 AM IST
Next Story