Telugu Global
Telangana

దొంగల ముసుగులు తొలిగిపోయాయి, లైడిటెక్టర్ టెస్టులకు సిద్దమా? -కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్

కిషన్ రెడ్డి గారూ! మీకో సూటి ప్రశ్న.ఆ సాములతో అసలు సంబంధమే లేదన్నోళ్లు…ఈ స్కాము సీబీఐకి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకుంటున్నరు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దొరికిన దొంగలపై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు సిద్ధమా ? అని కేటీఆర్ సవాల్ విసిరారు.

దొంగల ముసుగులు తొలిగిపోయాయి, లైడిటెక్టర్ టెస్టులకు సిద్దమా? -కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
X

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడం పై హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. ఆ కేసులో నిందితులతో తమకు సంబంధమే లేదని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సంబురాలు ఎందుకుచేసుకుంటున్నారని వరస ట్వీట్లతో కేటీఆర్ ప్రశ్నించారు. దొరికిన దొంగలపై, బీజేపీ బ్రోకర్స్ పై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు కూడా సిద్ధమా ? అని కేటీఆర్ కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.

కేటీఆర్ వర్స ట్వీట్లు....

''కిషన్ రెడ్డి గారూ! మీకో సూటి ప్రశ్న.

ఆ సాములతో అసలు సంబంధమే లేదన్నోళ్లు…ఈ స్కాము సీబీఐకి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకుంటున్నరు?

మీ బండారమంతా కెమెరా కన్నుకు చిక్కినప్పుడే.. మీ వెన్నులో వణుకు మొదలైంది

అప్పుడు భుజాలు తడుముకున్న మీరు.. ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారు?''

''మీకు ఏ సంబంధం లేకపోతే పలుమార్లు కోర్టుల్లో ఈ కేసు దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు?

సీబీఐకి అప్పగిస్తే అంత ఖుషీ ఎందుకు కిషన్ రెడ్డి గారు?

మీ Modi జేబు సంస్థ చేతికి కేసు చిక్కినందుకేనా.. ఈ పట్టలేనంత సంతోషం..?''

''ఒకప్పుడు సిబిఐ కి కేసు ఇస్తే నిందితులు భయపడే పరిస్థితి నుండి ఇవ్వాళ సిబిఐ కి కేసు అప్పజెప్తే మీరు సంబరాలు చేసుకుంటున్నారు అంటేనే ఆ సంస్థను మీ హయాంలో ఎంత నీరుగార్చారో అర్థమవుతుంది

కెమెరాల సాక్షిగా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిన దొంగలు మీరు.''

'''రెడ్ హ్యాండెడ్‌గా దొరికి ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఉంది మీ వ్యవహారం!

దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో మీరు కాంగ్రెస్ నే మించిపోయారు.

ఒకప్పుడు సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే వాళ్లు.

ఇప్పుడు సీబీఐని, కంట్రోల్డ్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు.''

''సీబీఐ దర్యాప్తుతోపాటు...

దొరికిన దొంగలపై, బీజేపీ బ్రోకర్స్ పై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు కూడా సిద్ధమా ?

మీరు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయగలరేమో గానీ..

శాస్త్రీయ పరీక్షలు (సైంటిఫిక్ టెస్టు) లను ఎవరూ మార్చలేరు. ఏమార్చలేరు.

మా సవాల్ స్వీకరించే దమ్ముందా?''

''మీ ఎనిమిదిన్నరేళ్ల పాలనతో మీరు ప్రజాక్షేత్రంలో ఎప్పుడో బద్నాం అయిపోయారు

బీజేపీని కొత్తగా బద్నాం చేయాల్సిన ఖర్మ మాకు లేదు!

ఈ దేశంలో గత ఎనిమిదేళ్లలో ప్రజాస్వ్యామ్యయుతంగా ఎన్నికైన 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర మీది

దొంగలకు సద్దులు మోసిన మీరు... సుద్దులు చెబితే నమ్మేదెవరు?''

''మీ దగ్గర విషయం లేదు కాబట్టే...

8 ఏళ్లుగా ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో 'విషప్రయోగం' చేస్తున్న మాట నిజంకాదా?

మీ BJP నాయకత్వం దగ్గర సరుకు లేదు కాబట్టే...ఎమ్మెల్యేలను అంగడి సరుకులా కొని.. రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న మాట వాస్తవం కాదా?''

''మీ చేతిలోని CBI, ED, IT లాంటి కీలుబొమ్మలు సాగించే విచారణ ఎలా ఉంటుందో దేశంలో అందరికీ తెలుసు...

కానీ... మీ BJP బండారంపై నిజమైన ప్రజాక్షేత్రంలో విచారణ ఎప్పుడో పూర్తయింది

సరైన సమయంలో మీపై తీర్పు చెప్పేందుకు యావత్ భారత సమాజం కూడా సిద్ధంగా ఉంది.''

అంటూ వరస ట్వీట్లతో మంత్రి కేటీఆర్ విరుచుకపడ్డారు.

First Published:  27 Dec 2022 9:15 PM IST
Next Story