Telugu Global
Telangana

డెడికేటెడ్ కమిషన్‌కు చైర్మన్‌‌గా విశ్రాంత ఐఏఎస్ నియామకం

డెడికేటెడ్ కమిటీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వరరావు నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి శాంతి కుమారి నేడు ఉత్తర్వులు జారీ చేశారు.

డెడికేటెడ్ కమిషన్‌కు చైర్మన్‌‌గా విశ్రాంత ఐఏఎస్ నియామకం
X

తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా రేవంత్ సర్కార్ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు విశ్రాంత ఐఏఎస్ పోసాని వెంకటేశ్వర రావును కమిషన్ చైర్మన్‌గా నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు ఉత్తర్వులు జారీ చేశారు. కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు డెడికేటెట్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై ముఖ్యమంత్రి తన నివాసంలో మంత్రులు ఇతర ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించి కమిషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, లీగల్ చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం స్పష్టం చేశారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

First Published:  4 Nov 2024 3:31 PM GMT
Next Story