జిల్లా గ్రంథాలయ సంస్థలకు చైర్మన్ ల నియామకం
11 జిల్లాల నేతలకు పదవులు ఇస్తూ పాత తేదీలతో ఉత్తర్వులు
BY Naveen Kamera6 Oct 2024 2:33 PM IST

X
Naveen Kamera Updated On: 6 Oct 2024 2:33 PM IST
జిల్లా గ్రంథాలయ సంస్థలకు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 26, అక్టోబర్ ఒకటి, మూడు తేదీలతో వేర్వేరు ఉత్తర్వులు ఇచ్చింది. కాంగ్రెస్ నాయకులకు జిల్లా స్థాయిలో ఈ పదవులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్మల్ జిల్లాకు సయ్యద్ అర్జుమంద్ అలీ, సిరిసిల్లకు నాగుల సత్యనారాయణ గౌడ్, కరీంనగర్ కు సత్తు మల్లయ్య, రంగారెడ్డి జిల్లాకు ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, వనపర్తికి జి. గోవర్ధన్, సంగారెడ్డికి గొల్ల అంజయ్య, కామారెడ్డికి మద్ది చంద్రకాంత్ రెడ్డి, మెదక్ కు సుహాసిని రెడ్డి, నారాయణ్ పేట్ కు వరాల విజయ్ కుమార్, నాగర్ కర్నూల్ కు జి. రాజేందర్, వికారాబాద్ కు శేరి రాజేశ్ రెడ్డి, మహబూబ్ నగర్ కు మల్లు నరసింహా రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాకు నీలి శ్రీనివాసులును చైర్మన్ గా నియమించారు.
Next Story