రేవంత్ టీమ్‌లోకి వీ6-వెలుగు జర్నలిస్టు
1996లో ఈనాడులో రిపోర్టర్‌గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన ఆయన సూర్యాపేట, ఖమ్మం, అనంతపూర్ జిల్లాల్లో పనిచేశారు. తర్వాత సాక్షి పేపర్ కరీంనగర్ బ్యూరోలో పనిచేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో ఇద్దరిని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బొలగం శ్రీనివాస్‌తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన శ్రీధర్ మామిడాల సీఎంకు పీఆర్వోలుగా వ్యవహరించనున్నారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి రానుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ బొలగం శ్రీనివాస్ స్వగ్రామం. 1996లో ఈనాడులో రిపోర్టర్‌గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన ఆయన సూర్యాపేట, ఖమ్మం, అనంతపూర్ జిల్లాల్లో పనిచేశారు. తర్వాత సాక్షి పేపర్ కరీంనగర్ బ్యూరోలో పనిచేశారు. స్టేట్ బ్యూరోలోనూ వివిధ శాఖల వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం వీ6- వెలుగు పత్రిక హైదరాబాద్ నెట్‌వర్క్ ఇన్‌చార్జిగా, బ్యూరో చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.
మరో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ మామిడాలది ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక. శ్రీధర్ గతంలో ABN, 10 టీవీల్లో రిపోర్టర్‌గా పని చేశారు. ఇప్పటికే సీఎం సీపీఆర్‌వోగా నల్గొండకు చెందిన బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమించారు.