సీఎం రిలీఫ్ ఫండ్ కు అపెక్స్ బ్యాంక్ విరాళం
రూ.1.51 కోట్ల చెక్కు అందజేసిన టీజీక్యాబ్ పాలకవర్గం
BY Naveen Kamera6 Nov 2024 7:18 PM IST

X
Naveen Kamera Updated On: 6 Nov 2024 7:18 PM IST
ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణ స్టేట్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రూ.1.51 కోట్ల విరాళం అందజేసింది. బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి టీజీ క్యాబ్ పాలకవర్గం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విరాళం చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. కార్యక్రమంలో టీజీ క్యాబ్ చైర్మన్ రవీందర్ రావు, వైస్ చైర్మన్ సత్తయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు సాయి రాజేంద్రప్రసాద్ వివాహానికి రావాలని ఆహ్వానించారు.
Next Story