ఏపీ శాసనసభ రేపటికి వాయిదా
ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.
BY Vamshi Kotas24 Feb 2025 12:05 PM IST

X
Vamshi Kotas Updated On: 24 Feb 2025 1:20 PM IST
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కాసేపు నిరసన కార్యక్రాన్ని చేపట్టిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ వాకౌట్ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ప్రసంగం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ గవర్నర్ ను వాహనం వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. సభ వాయిదా పడిన వెంటనే బీఏసీ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అజెండాను నిర్ణయించనున్నారు.
Next Story