తెలంగాణలో జాయినింగ్ రిపోర్ట్ చేసిన ఏపీ ఐఏఎస్‌లు
తెలంగాణ సీఎస్ శాంతి కుమారిని ఏపీ ఐఏఎస్‌లు కలిశారు. డీవోపీటీ ఆదేశాల మేరకు సీఎస్‌ను కలిసి సృజన, శివ శంకర్‌లు జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు.
BY Vamshi Kotas16 Oct 2024 7:41 PM IST
X
Vamshi Kotas Updated On: 16 Oct 2024 7:41 PM IST
ఏపీ ఐఏఎస్‌లు సృజన, శివ శంకర్‌లు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలిసి జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. తెలంగాణలో రిపోర్ట్ చేయాల్సిందిగా వీరిని డీవోపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ నుంచి ఐఏఎస్‌లు అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ఏపీకి వెళ్లున్నారు. ఐపీఎస్‌లకు కేంద్ర హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో అంజనీ కుమార్, అభిలాష బిస్త్, తెలంగాణలో కొనసాగనున్నారు. క్యాట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా భంగపాటు తప్పలేదు. తెలంగాణ హైకోర్టు కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
Next Story