Telugu Global
Telangana

బీజేపీకిమరో షాక్... టీఆరెస్ లోకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌

మాజీ ఎంపీ, ప్రముఖ పద్మశాలీ నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేసి సోమవారంనాడు టీఆరెస్ లో చేరనున్నారు. ఈ మేరకు ఆదివారంనాడు ఆయన టీఆరెస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపారు.

బీజేపీకిమరో షాక్... టీఆరెస్ లోకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌
X

మునుగోడు అసెంబ్లీ ఎన్నిక వేళ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకులు దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్, బిక్షపతి గౌడ్ లూ బీజేపీకి రాజీనామా చేసి టీఆరెస్ లో చేరగా మరో ముఖ్యనాయకుడు రాపోలు ఆనంద భాస్కర్ సోమవారం టీఆరెస్ లో చేరనున్నారు.

ఈ మేరకు ఆయన ఆదివారం కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపారు. మునుగోడులో అత్యధిక శాతం పద్మశాలీలు ఉన్న నేపథ్యంలో మాజీ ఎంపీ, ప్రముఖ పద్మశాలీ నాయకుడైన రాపోలు టీఆరెస్ లో చేరడం టీఆరెస్ కు కలిసి వచ్చే అంశం గా భావిస్తున్నారు.

చేనేత పై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం పట్ల ఆనంద భాస్కర్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. చేనేత రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.

కాగా మొదట రాపోలు ఆనంద భాస్కర్ జర్నలిస్టుగా పని చేశారు. 2012-18 మధ్య రాపోలు ఆనంద భాస్కర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆయన బీజేపీలో చేరారు.

కొంత కాలంగా బీజేపీ విధానాలపట్ల అసంత్రుప్తిగా ఉన్న ఆనంద భాస్కర్, నేత కుటుంబం నుంచి వచ్చిన తాను బీజేపీ చేస్తున్న ఈ నిర్వాకాన్ని చూస్తూ భరించలేనని పేర్కొన్నారు. చేనేత రంగంపై కేంద్రం జీఎస్టీ విధించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి రాజీనామా చేసి టీఆరెస్ లో చేరాలనినిర్ణయించుకున్నారు. చేనేత రంగానికి సీఎం కేసీఆర్‌ సారధ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు భాస్కర్.

First Published:  23 Oct 2022 11:35 PM IST
Next Story