HCA పై మరో కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై బేగంపేట పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే HCA పై మూడు కేసులు నమోదు కాగా, మ్యాచ్ టికెట్‌పై ఉన్న సమయం, ప్రారంభమైన మ్యాచ్ మధ్య వ్యత్యాసం ఉందంటూ ఓ యువకుడి పిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యింది.
BY Telugu Global28 Sept 2022 11:12 AM IST

X
Telugu Global Updated On: 28 Sept 2022 11:45 AM IST
హైదరాబాద్ లో ఆదివారం జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు ముందు జరిగిన గందరగోళం HCA ను ఇబ్బందుల్లో ఇరికించింది. టిక్కట్లు బ్లాక్ లో అమ్ముకున్నారనే ఆరోపణలు, టిక్కట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో క్రికెట్ అభిమానులకు గాయాలు, స్టేడియంలో సీటింగ్ చెత్తగా ఉండటం...తదితర వ్యవహారాలు HCA ను అపఖ్యాతి పాలు చేశాయి.
తొక్కిసలాట కేసు సహా ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా ఈ రోజు మరో కేసు నమోదయ్యింది. మ్యాచ్ టికెట్‌పై ఉన్న సమయం, ప్రారంభమైన మ్యాచ్ మధ్య వ్యత్యాసం ఉందంటూ బేగంపేట పోలీసు స్టేషన్ లో ఓ యువకుడు పిర్యాదు చేశాడు. టికెట్‌పై మ్యాచ్ ప్రారంభ సమయం 7:30 ఉండగా 7 గంటలకే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరో వైపు టిక్కట్ల అమ్మకాల సమయంలో జరిగిన తొక్కిసలాటపై కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
Next Story