Telugu Global
Telangana

మల్లారెడ్డికి మరో షాక్.. కాలేజీల్లో ఐటీ అధికారుల సోదాలు

దుండిగల్ పరిధిలో చెరువు శిఖం భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఇటీవల అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.

మల్లారెడ్డికి మరో షాక్.. కాలేజీల్లో ఐటీ అధికారుల సోదాలు
X

మాజీమంత్రి మల్లారెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చెరువు భూములను ఆక్రమించి కాలేజీలు నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లారెడ్డికి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. మైసమ్మగూడలోని ఆయన కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంం 10 మంది అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంటున్నారని సమాచారం. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను బ్లాక్‌లో అమ్ముకునే ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు, బంధువుల పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులను ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆదాయపు పన్ను ఎగ్గొట్టారని మల్లారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.

దుండిగల్ పరిధిలో చెరువు శిఖం భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఇటీవల అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. సోమవారం మల్లారెడ్డి అగ్రికల్చర్ ప్రైవేట్ వర్సిటీలో విద్యార్థులను డిటైన్‌ చేయడంపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. మల్లారెడ్డి దిష్టిబొమ్మ సైతం దగ్ధం చేశారు. ఈ ఘటనల నుంచి తేరుకోకముందే ఐటీ అధికారుల దాడులు మల్లారెడ్డికి షాక్ అనే చెప్పుకోవాలి.

First Published:  19 March 2024 5:07 AM
Next Story