Telugu Global
Telangana

20 సెగ్మెంట్లలో బీఎస్పీ అభ్యర్థుల ప్రకటన.. జనరల్ సీటు నుంచే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ

రాష్ట్రంలోని పలు జనరల్ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయడానికి రెడీ అయ్యింది. ఆర్ఎస్ ప్రవీణ్ స్వయంగా ఒక జనరల్ స్థానం నుంచి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

20 సెగ్మెంట్లలో బీఎస్పీ అభ్యర్థుల ప్రకటన.. జనరల్ సీటు నుంచే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ
X

బహుజన్ సమాజ్‌వాది పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత కొంత కాలంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బీఎస్పీకి బలమున్న చోట్ల పార్టీ అభ్యర్థులను నిలబెట్టడానికి కసరత్తు చేస్తున్నారు. ఐపీఎస్ హోదాలో ఉన్నతమైన జాబ్‌కు రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ కుమార్‌కు తెలంగాణలో పాలోయింగ్ బాగానే ఉన్నది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీఎస్పీ బాధ్యతలను భూజానికి ఎత్తుకున్నారు.

రాష్ట్రంలోని పలు జనరల్ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయడానికి రెడీ అయ్యింది. ఆర్ఎస్ ప్రవీణ్ స్వయంగా ఒక జనరల్ స్థానం నుంచి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. సిర్పూర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా బరిలోకి దిగుతున్నారు. ఇక గత కొంత కాలంగా సూర్యపేటకు చెందిన వట్టె జానయ్య వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అక్కడ మంత్రి జగదీశ్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా ఈ సారి బీఎస్పీ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వట్టె జానయ్య యాదవ్ భార్య రేణుక బీఎస్పీలో జాయిన్ అయ్యారు.

బీఎస్పీ అభ్యర్థుల లిస్టు పేరుతో విడుదలైన లెటర్ ప్యాడ్‌పై ఎవరి సంతకం లేదు. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ తెలంగాణ సోషల్ మీడియా అకౌంట్లలో కూడా దీనికి సంబంధించిన వివరాలేమీ కనపడలేదు. దీంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ లిస్టుపై పలు అనుమానాలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్టు..

1. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ - సిర్పూర్ (జనరల్)

2. జంగం గోపి - జహీరాబాద్ (ఎస్సీ)

3. దాసరి ఉష - పెద్దపల్లి (జనరల్)

4. చంద్రశేఖర్ ముదిరాజ్ - తాండూర్ (జనరల్)

5. ఎం.వెంకటేశ్ చౌహాన్ - దేవరకొండ (ఎస్టీ)

6. కొంకటి శేఖర్ - చొప్పదండి (ఎస్సీ)

7. అల్లిక వెంకటేశ్వరరావు - పాలేరు (జనరల్)

8. మేడి ప్రియదర్శిని - నకిరేకల్ (ఎస్సీ)

9. బోనాతు రాంబాబు నాయక్ - వైరా (ఎస్టీ)

10. నక్కా విజయకుమార్ - ధర్మపురి (ఎస్సీ)

11. నాగమొని చెన్నరాములు ముదిరాజ్ - వనపర్తి (జనరల్)

12. నిశానీ రామచందర్ - మానకొండూరు (ఎస్సీ)

13. పిలుట్ల శ్రీనివాస్ - కోదాడ (జనరల్)

14. కొత్తపల్లి కుమార్ - నాగర్‌కర్నూలు (జనరల్)

15. బన్సీలాల్ రాథోడ్ - ఖానాపూర్ (ఎస్టీ)

16. ముప్పారపు ప్రకాశం - ఆందోల్ (ఎస్సీ)

17. వట్టె జానయ్య యాదవ్ - సూర్యాపేట (జనరల్)

18. గోర్లకడ క్రాంతి కుమార్ - వికారాబాద్ (ఎస్సీ)

19. ఎర్రా కామేశ్ - కొత్తగూడెం (జనరల్)

20. ప్రద్య్నకుమార్ మాధవ్‌రావు ఏకాంబర్ - జుక్కల్ (ఎస్సీ)




First Published:  3 Oct 2023 12:14 PM GMT
Next Story