Telugu Global
Telangana

తెలంగాణ పాలనపై భార్య షర్మిల ఆరోపణలు ఖండించిన అనిల్

ఏపీలో పుట్టిన పిల్లలపైనా అప్పు ఉందని, పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని నర్మగర్భంగా తన బావ పాలిస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పరిస్థితులను ఎత్తి చూపుతూ, పక్క రాష్ట్రం అంటూ తెలంగాణని పొగిడారు.

తెలంగాణ పాలనపై భార్య షర్మిల ఆరోపణలు ఖండించిన అనిల్
X

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ సర్కారుపై నిత్యమూ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. దీనికి భిన్నంగా ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పరోక్షంగా తెలంగాణలో పుట్టాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అంటే తెలంగాణలో పాలన బాగుందని షర్మిల భర్త కితాబు ఇచ్చినట్టే. విశాఖ జిల్లా భీమిలి ప్రార్థన కూడికకి హాజరైన బ్రదర్ అనిల్ ..ఏపీ, తెలంగాణ సర్కారు పేర్లు ప్రస్తావించకుండా చాలా తెలివిగా ప్రసంగించారు. ఏపీలో పుట్టిన పిల్లలపైనా అప్పు ఉందని, పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని నర్మగర్భంగా తన బావ పాలిస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పరిస్థితులను ఎత్తి చూపుతూ, పక్క రాష్ట్రం అంటూ తెలంగాణని పొగిడారు. తన భార్య షర్మిల రాజకీయ మనుగడ కోసం తెలంగాణ సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేస్తోంది. ఇదే సమయంలో ఆమె భర్త అనిల్ తెలంగాణలో పుట్టాలని ఏపీ వాసులు కోరుకుంటున్నారనడం..భార్య ఆరోపణలు తప్పు అని చెప్పినట్టే అయ్యింది.

First Published:  16 Dec 2022 1:56 PM IST
Next Story