మంటపెట్టిన అందెశ్రీ ఫోన్ కాల్.. బూతులతో రెచ్చిపోతున్న నెటిజన్లు
ఫోన్ కాల్ లీక్ కావడంతో అందెశ్రీపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను అద్దెశ్రీగా అభివర్ణిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా ప్రాంత కీరవాణి సంగీతాన్ని ఇవ్వడం చాలామందికి ఇష్టం లేదు. ఇదే విషయంపై గీతకారుడు అందెశ్రీకి నేరుగా ఫోన్ చేసి ఓ యువకుడు తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అందెశ్రీ సమాధానం అతడిని సంతృప్తిపరచకపోగా కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. తెలంగాణ ఇచ్చింది ఇటలీ వనిత సోనియా అని అన్నారు అందెశ్రీ. ఇటలీ వనిత ఇచ్చిన తెలంగాణను స్వాగతించినప్పుడు, ఈ పాటను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారాయన. దీంతో పాట వివాదం కొత్త మలుపు తిరిగింది.
అందెశ్రీ ఫోన్ కాల్ లీక్
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2024
తెలంగాణలో కీరవాణి కంటే గొప్ప సంగీత దర్శకుడు ఎవరున్నారు?
జయ జయహే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతం వద్దు అనే వాళ్ళు ఇటలీకి చెందిన సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఎలా తీసుకున్నారు - అందెశ్రీ pic.twitter.com/CkUo1nGmXR
అద్దెశ్రీ..
ఫోన్ కాల్ లీక్ కావడంతో అందెశ్రీపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను అద్దెశ్రీగా అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో కీరవాణిని సపోర్ట్ చేసేవారు, తెలంగాణ పాటకు ఆయన సంగీతాన్నివ్వడాన్ని వ్యతిరేకించేవారు రెండు గ్రూపులుగా విడిపోయి బూతులు తిట్టుకుంటున్నారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగలి వెంకయ్య ఆంధ్ర ప్రాంత వ్యక్తి అని, తెలంగాణలో జాతీయ పతాకాన్ని ఎగరేయడం లేదా అని ప్రశ్నిస్తున్నారు కొందరు. ఎన్ని సంవత్సరాలు తెలంగాణలో ఉంటే తెలంగాణ పౌరుడిగా గుర్తింపు ఉంటుందని అడుగుతున్నారు. ఓట్లకోసం ఆంధ్రప్రాంతం వాళ్లు కావాలి, పాటలకోసం వద్దా అని ప్రశ్నిస్తున్నారు ఆ వర్గం నెటిజన్లు. SRH టీమ్ లో కూడా అందరూ తెలంగాణ ఆటగాళ్లే ఉండాలేమో అని దెప్పిపొడుస్తున్నారు.
తెలంగాణలో సంగీత దర్శకులు లేరని అడుగుతున్న అందెశ్రీ గారికి వీళ్ళు కనపడలేదా
— AR (@AshokReddyNLG) May 28, 2024
ఎస్పీ బాలసుబ్రమణ్యం, కీరవాణి సహా ఎంతో మంది సింగర్లతో పాటలు పాడించి ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన వందేమాతరం శ్రీనివాస్ గారు కనపడలేదా
మీ అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డికి హిట్ సాంగ్ ఇచ్చిన చరణ్… https://t.co/0zBjCzWJzq pic.twitter.com/AMNTWO39Bf
ఆ వాదన సరైంది కాదు..
మిగత విషయాలతో ఈ పాటను పోల్చడం సరికాదంటున్నారు తెలంగాణ ప్రాంత వాసులు. ఇది ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అని గుర్తు చేస్తున్నారు. ఎంతోమంది ప్రతిభ ఉన్న సంగీత దర్శకులు తెలంగాణలో ఉంటే.. ఆస్కార్ వచ్చిందన్న కారణంగా కీరవాణిని ప్రభుత్వం ఎంపిక చేసుకోవడం సరికాదని చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా అని అందెశ్రీ చేసిన వ్యాఖ్యల్ని కూడా చాలామంది తప్పుబడుతున్నారు.
మొత్తమ్మీద అందెశ్రీ పాటకు, కీరవాణి సంగీతం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కీరవాణి ఎందుకు భాయ్.. అంటూ విమర్శించారు. అందెశ్రీ నేరుగా స్వరపరచిన పాత పాటనే పాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఇక కొత్తగీతం విడుదలయ్యే లోపు ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.