సొంత ప్రిపరేషన్.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 3వ ర్యాంకు.. పాలమూరు బిడ్డ ఘనత
అనన్య పదోతరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైస్కూల్‌లో చదివారు. హైదరాబాద్‌లో ఇంటర్ చదివారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఇంటర్ చదివేటప్పటి నుంచే సివిల్స్ లక్ష్యంగా ముందుకెళ్లారు.
పాలమూరు బిడ్డ సివిల్స్‌లో సత్తా చాటింది. తొలి ప్రయత్నంలోనే యుపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 3వ స్థానంతో మెరిసింది. అదీ ఎలాంటి శిక్షణా లేకుండా సొంత ప్రిపరేషన్‌తో సివిల్స్‌లో విజయపతాకం ఎగరేసి తెలుగువారి సత్తాను దేశానికి ఘనంగా చాటిచెప్పారు మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్యరెడ్డి. యూపీఎస్సీ ఈరోజు విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో అనన్య అసామాన్య విజయంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
అనన్య పదోతరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైస్కూల్‌లో చదివారు. హైదరాబాద్‌లో ఇంటర్ చదివారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఇంటర్ చదివేటప్పటి నుంచే సివిల్స్ లక్ష్యంగా ముందుకెళ్లారు.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలంటే కోచింగ్ తప్పనిసరి అని చెబుతారు. అదీ ఒకటి రెండు ప్రయత్నాలు చేస్తే తప్ప సక్సెస్ కాలేనివారు వేలల్లో ఉంటారు. రెండు, మూడు ప్రయత్నాల తర్వాత కూడా వందల్లో ర్యాంకు వచ్చి ఐఏఎస్ కావాలనుకున్నవారు ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌లుగా స్థిరపడిపోతుంటారు. కానీ, అనన్య వాటన్నింటినీ బద్దలుకొట్టేశారు. తొలి ప్రయత్నంలోనే, అదీ ఎలాంటి శిక్షణ లేకుండానే నేరుగా 3వ ర్యాంకు కొట్టి శభాష్ అనిపించుకున్నారు.
సివిల్స్ కొడతాననుకున్నాను గానీ ఏకంగా 3వ ర్యాంకు వస్తుందని ఊహించలేదని అనన్య ఫలితాల అనంతరం తన ఆనందాన్ని పంచుకున్నారు. రోజూ 12 నుంచి 14 గంటల పాటు ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్ తన విజయరహస్యమని చెప్పారు.