Telugu Global
Telangana

నేడు తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ వచ్చాక బీజేపీ తొలి సభ ఇదే

ఇటీవలే అమిత్‌ షా ఆదిలా­బాద్‌ పర్యటన ఖరారు కాగా.. ఎన్ని­కల షెడ్యూల్‌ జారీ కావడంతో ఈ సభ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) పరిధిలోకి వెళ్తుంది. ఈ సభ ఖర్చు పార్టీ పరిధిలోకి వస్తుందని అధికారులు చెబు­తున్నారు.

నేడు తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ వచ్చాక బీజేపీ తొలి సభ ఇదే
X

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తెలంగాణలో బీజేపీ తొలి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఆదిలాబాద్ లో బహిరంగ సభ జరగబోతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తున్నారు. జన­గర్జనగా ఈ సభకు పేరు పెట్టారు. ఇటీవలే అమిత్‌ షా ఆదిలా­బాద్‌ పర్యటన ఖరారు కాగా.. ఎన్ని­కల షెడ్యూల్‌ జారీ కావడంతో ఈ సభ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) పరిధిలోకి వెళ్తుంది. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలక కాకపోవడంతో ఈ సభ ఖర్చు పార్టీ పరిధిలోకి వస్తుందని అధికారులు చెబు­తున్నారు.

ముందు మోదీ, ఇప్పుడు అమిత్ షా..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పెద్దల సభలపైనే బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ప్రధాని మోదీ రెండుసార్లు తెలంగాణకు వచ్చారు. మహబూబ్ నగర్, నిజామాబాద్ లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అమిత్ షా ఆదిలాబాద్ సభతో పొలిటికల్ హీట్ మరింత పెంచబోతున్నారు. ఆదిలాబాద్ సభ అనంతరం హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. దాదాపు 2 గంటలసేపు ఈ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత సికింద్రాబాద్‌ సిఖ్‌ విలేజిలోని ఇంపీరియల్‌ గార్డెన్స్ లో జరిగే మేధావుల సదస్సుకి అమిత్‌ షా హాజరవుతారు.

అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు..?

అంతా బాగానే ఉంది, కేంద్రంలోని బీజేపీ పెద్దలంతా రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. కానీ బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడనేది మాత్రం తేలడంలేదు. మిగతా రాష్ట్రాల్లో ఎంపీలను అసెంబ్లీ బరిలో దింపుతున్న బీజేపీ.. ఇక్కడ కూడా ఆప్రయత్నం చేయాలనుకుంటోంది. కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా.. మిగతావాళ్లు కూడా ఆ సాహసం చేయలేమంటున్నారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఇంకా బీజేపీలో క్లారిటీ లేదు. నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూనే ఉంటాం, అది మా స్ట్రాటజీ అని కిషన్ రెడ్డి గొప్పగా చెప్పుకోవడం మాత్రం విశేషం.

First Published:  10 Oct 2023 8:06 AM IST
Next Story