Telugu Global
Telangana

నిన్న కాదు ఈ రోజు, ఈ రోజు కాదు రేపు.. అమిత్ షా మళ్లీ లేటు

ఈ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. దానికి పోటీగా ఇదే రోజు బీజేపీ మేనిఫెస్టో కూడా విడుదలవుతుందని అనుకున్నారు. ఆ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. అయితే చివరి నిమిషంలో అమిత్ షా ఈ రోజు హైదరాబాద్ రావడంలేదని కబురందింది.

నిన్న కాదు ఈ రోజు, ఈ రోజు కాదు రేపు.. అమిత్ షా మళ్లీ లేటు
X

అమిత్ షా తెలంగాణ పర్యటన విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు ఆయన తెలంగాణకు వస్తున్నారా లేదా, వస్తే ఎప్పుడు అనేది ఆ పార్టీ నేతలకే సరైన సమాచారం దొరకడంలేదు. ఈ రోజు అమిత్ షా తెలంగాణకు రావాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో అది వాయిదా పడింది. ఆయన రేపు తెలంగాణకు వస్తారంటున్నారు, ఒక్కరోజులోనే అమిత్ షా పర్యటన ముగుస్తుంది.

వాస్తవానికి అమిత్ షా రెండు రోజుల పర్యటన కోసం ఈనెల 16న తెలంగాణకు వస్తారని, 17వ తేదీ మేనిఫెస్టో విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత పర్యటన 17, 18కి మారింది. ఇప్పుడు 18వ తేదీ ఒక్కరోజే పర్యటన అని ఫైనల్ గా తేలింది. తాజా మార్పుల ప్రకారం రేపు(శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. అనంతరం 12.50 గంటలకు గద్వాల సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నల్గొండ, వరంగల్ సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం 6.10 గంటలకు హైదరాబాద్ చేరుకుని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఆ తర్వాత ఎంఆర్పీఎస్ నాయకులతో సమావేశం ఉంటుంది. సాయంత్రం 7:55 కి బేగంపేట విమానాశ్రయం నుంచి అమిత్ షా అహ్మదాబాద్ బయలుదేరి వెళ్తారు.

ఈ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. దానికి పోటీగా ఇదే రోజు బీజేపీ మేనిఫెస్టో కూడా విడుదలవుతుందని అనుకున్నారు. ఆ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. అయితే చివరి నిమిషంలో అమిత్ షా ఈ రోజు హైదరాబాద్ రావడంలేదని కబురందింది. రేపు ఆయన హైదరాబాద్ కి వస్తారు, రేపే ఆయన చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో విడుదలవుతుంది.

First Published:  17 Nov 2023 4:23 PM IST
Next Story