Telugu Global
Telangana

ఈటల, బండికి అమిత్ షా వార్నింగ్.!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో సమన్వయంతో పని చేయాలని నేతలకు సూచించారు అమిత్ షా. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను కిషన్‌ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు అమిత్ షా.

ఈటల, బండికి అమిత్ షా వార్నింగ్.!
X

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు, సోషల్‌మీడియాలో వార్‌, లీకులపై ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా సీరియస్ అయ్యారు. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో బీజేపీ నేతల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన ట్లు సమాచారం. నేతల మధ్య నెలకొన్న కోల్డ్‌వార్‌పైనే ప్రధానంగా అమిత్ షా ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. నేతల్లో సమన్వయం లోపించిందని, పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని మీడియాలో వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ అమిత్ షా సీరియస్ అయినట్లు సమాచారం. నేతలు ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా లైన్‌ దాటి మాట్లాడితే సహించేది లేదని అమిత్ షా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వొద్దని లీడర్లకు సూచించారు అమిత్ షా.

ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో సమన్వయంతో పని చేయాలని నేతలకు సూచించారు అమిత్ షా. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను కిషన్‌ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. సిట్టింగ్ ఎంపీలు ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు ఆయన ఓకే చెప్పారని సమాచారం. ఇక మిగిలిన స్థానాల్లో ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేతలు, వారి బలాబలాలు, సమర్థతపై షా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఇద్దరూ కలిసి ప్రెస్‌మీట్ పెట్టాలని అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఐతే ఈటల ఒక్కరే మీడియా సమావేశం నిర్వహించగా..బండి హాజరుకాలేదు.

First Published:  28 Dec 2023 10:48 PM IST
Next Story