అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. ముగ్గురు టీ.కాంగ్రెస్ నేతల అరెస్టు
తాజా అరెస్టులు తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జరిగనట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసుల నోటీసుల కన్నా ముందే ప్రేమేందర్ రెడ్డి ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. ఇవాళ మరో ముగ్గురిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీష్‌తో పాటు నవీన్, తస్లీమాను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే తాజా అరెస్టులు తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జరిగనట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసుల నోటీసుల కన్నా ముందే ప్రేమేందర్ రెడ్డి ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన కేసులో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇటీవల ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇక ఇప్పటికే ఈ కేసులో అస్సాంలో ఒకరిని, గుజరాత్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏను అరెస్టు చేశారు.