Telugu Global
Telangana

హైదరాబాద్ టి-హబ్‌ను సందర్శించిన‌ అమెరికా రాయబారి బెత్ జోన్స్

“హైదరాబాద్ ఆర్థిక చైతన్యాన్ని తెలియజేయడానికి హైదరాబాద్ టి హబ్ మంచి ఉదహరణ‌ . అంబాసిడర్ జోన్స్ కు, నాకు ఐటి మంత్రి కేటీఆర్, ఆతిథ్యం ఇచ్చారు, ఇక్కడ చాలామంది టి-హబ్‌ను భారతదేశపు ప్రీమియర్ స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా ఎందుకు చూస్తున్నారో నాకు అర్దమయ్యింది ”అని జెన్నిఫర్ లార్సన్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ టి-హబ్‌ను సందర్శించిన‌ అమెరికా రాయబారి బెత్ జోన్స్
X

భారతదేశంలోని అమెరికా రాయబారి బెత్ జోన్స్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సోమవారం నగరంలోని టీ-హబ్‌ను సందర్శించారు.

“హైదరాబాద్ ఆర్థిక చైతన్యాన్ని తెలియజేయడానికి హైదరాబాద్ టి హబ్ మంచి ఉదహరణ‌ . అంబాసిడర్ జోన్స్ కు, నాకు ఐటి మంత్రి కేటీఆర్, ఆతిథ్యం ఇచ్చారు, ఇక్కడ చాలామంది టి-హబ్‌ను భారతదేశపు ప్రీమియర్ స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా ఎందుకు చూస్తున్నారో నాకు అర్దమయ్యింది ”అని జెన్నిఫర్ లార్సన్ ట్వీట్ చేశారు.

తరువాత, US కాన్సుల్ జనరల్ కూడా నగరంలో ఏరోస్పేస్ రంగాన్ని అభివృద్ది చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు.

హైదరాబాద్‌లో ఏరోస్పేస్ పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందుతున్నది. ఈ అభివృద్దిని మేము టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ పర్యటనలో ప్రత్యక్షంగా చూశాము. యుఎస్-భారత్ రక్షణ భాగస్వామ్యానికి ఇది గొప్ప ఉదాహరణ” అని ఆమె ట్వీట్ చేశారు.

First Published:  10 Jan 2023 8:12 AM IST
Next Story