Telugu Global
Telangana

అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి అప్లికేషన్‌ల గడువు పొడిగింపు

ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకునే చాన్స్‌

అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి అప్లికేషన్‌ల గడువు పొడిగింపు
X

విదేశీ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ విద్యార్థులు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకంలో భాగంగా అప్లికేషన్‌ లు సమర్పించే గడువు పొడిగించామని ఎస్సీ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు ఈ - పాస్‌ వెబ్‌ సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.10 లక్షల చొప్పున రెండేళ్లకు రూ.20 లక్షలు అందజేస్తామని పేర్కొన్నారు.

First Published:  15 Oct 2024 10:20 AM GMT
Next Story