Telugu Global
Telangana

తెలంగాణలో కొత్తగా రూ. 36,300 కోట్ల పెట్టుబ‌డులు పెట్టనున్న అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్...హర్షం వ్యక్తం చేసిన‌ కేటీఆర్

తెలంగాణలో 2020లో రూ.20,096 కోట్ల పెట్టుబడి పెట్టగా, 2030 నాటికి తన పెట్టుబడిని రూ.36,300 కోట్లకు పెంచుతామని AWS ప్రకటించింది.

తెలంగాణలో కొత్తగా రూ. 36,300 కోట్ల పెట్టుబ‌డులు పెట్టనున్న అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్...హర్షం వ్యక్తం చేసిన‌ కేటీఆర్
X

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) తెలంగాణలో పెట్టుబడులు పెంచుతున్నట్టు ప్రకటించింది.

తెలంగాణలో 2020లో రూ.20,096 కోట్ల పెట్టుబడి పెట్టగా, 2030 నాటికి తన పెట్టుబడిని రూ.36,300 కోట్లకు పెంచుతామని AWS ప్రకటించింది.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన AWS ఎంపవర్ ఇండియా ఈవెంట్ సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

హైదరాబాద్‌లో చందన్‌వెల్లి, ఎఫ్‌ఏబీ సిటీ, ఫార్మా సిటీలో AWS ఏర్పాటు చేసిన మూడు డేటా సెంటర్ క్యాంపస్‌లలో దశలవారీగా ఈ పెట్టుబడులు పెడతారు. ఈ మూడు డేటా సెంటర్లలో మొదటి దశ పూర్తయింది. వినియోగదారులకు క్లౌడ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

AWS పెట్టుబడిని స్వాగతించిన తెలంగాణ IT మంత్రి KTR , “అమెజాన్ తమ హైదరాబాద్ డేటా సెంటర్లలో మరింత పెట్టుబడిని పెట్టడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఇ-గవర్నెన్స్, హెల్త్‌కేర్, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరచడానికి తాము AWSతో కలిసి పనిచేస్తామన్నారు.

First Published:  20 Jan 2023 8:00 PM IST
Next Story