Telugu Global
Telangana

హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నూతన కేంద్రం

Amazon web services in Hyderabad: భారత్ లో యాక్టివ్ డేటా సెంటర్ హబ్‌ గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేసే దిశగా హైదరాబాద్‌ లో AWS ఏర్పాటుని స్వాగతిస్తున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్.

హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నూతన కేంద్రం
X

ప్రపంచంలోనే అతి పెద్ద అమెజాన్ ఆఫీస్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది. ఈ ఘనతతో పాటు ఇప్పుడు మరో ఘనత కూడా అమెజాన్ ద్వారా హైదరాబాద్ సొంతం చేసుకుంది. దేశంలోనే రెండో వెబ్ సర్వీసెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అమెజాన్ సంస్థ హైదరాబాద్ ని కేంద్రం చేసుకుంది. హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఆసియా పసిఫిక్ రీజియన్ ని ప్రారంభిస్తోంది.

AWS ఏంచేస్తుంది..?

అమెజాన్ అంటే చాలామందికి ఆన్ లైన్ వ్యాపార సంస్థగా మాత్రమే పరిచయం. కానీ అమెజాన్ అనుబంధ సంస్థలు చాలానే ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ రంగంలో అమెజాన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇప్పటికే అందరికీ దగ్గరైంది. క్లౌడ్ కంప్యూటింగ్ లో కూడా అమెజాన్ టాప్ ప్లేస్ కోసం ప్రయత్నిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కంప్యూటర్ రంగంలో వివిధ సేవలను అందిస్తోంది. వినియోగదారులు AWS ద్వారా క్లౌడ్ స్టోరేజ్ ని పొందవచ్చు. అప్లికేషన్ పోగ్రామింగ్ ఇంటర్ఫేస్(API) సేవలను సంస్థలకు, స్టార్టప్ కంపెనీలకు, వ్యక్తులకు అందజేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నిటికీ క్లౌడ్ సర్వీస్ లు అందజేస్తోంది AWS.

దీనికి సంబంధించి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బ్రాంచ్ లను ఏర్పాటు చేశారు. 30 ప్రాంతాల్లో 96 జోన్ లను ఏర్పాటు చేసింది AWS. భారత్ లో ప్రస్తుతానికి ముంబైలో మాత్రమే AWS కేంద్రం ఉంది. ఇప్పుడు ఆసియా పసిఫిక్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం విశేషం.

భారత్ లో యాక్టివ్ డేటా సెంటర్ హబ్‌ గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేసే దిశగా హైదరాబాద్‌ లో AWS ఏర్పాటుని స్వాగతిస్తున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్. 36,300 కోట్ల పెట్టుబడులు ఈ సెంటర్ ద్వారా తెలంగాణకు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణలోని ఇ-గవర్నెన్స్, హెల్త్ కేర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన పలు అప్లికేషన్లు ఇప్పటికే AWS సేవలను వినియోగించుకుంటున్నాయని, నేరుగా హైదరాబాద్ లోనే AWS సెంటర్ ఏర్పాటుతో స్టార్టప్ లు, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల ఆవిష్కరణలకు మరింత ఊతం దొరికినట్టవుతుందని చెప్పారు మంత్రి కేటీఆర్.

2030నాటికి తెలంగాణలో 36,300 కోట్ల పెట్టుబడులు AWS ద్వారా రాబోతున్నాయి. 48వేలమంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాలు AWS సేవలను పొందుతున్నాయి. భారత్ లో పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఆన్ లైన్ ఆధారిత కంపెనీలు, బీమా కంపెనీలు, ఆన్ లైన్ బోధన చేస్తున్న కంపెనీలు AWSకి ఖాతాదారులు కావడం విశేషం.

First Published:  22 Nov 2022 12:22 PM IST
Next Story