అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం.. సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
తెలంగాణ హైకోర్టు ఏర్పాటు తర్వాత జస్టిస్ అలోక్ అరాధే ఆరో ప్రధాన న్యాయమూర్తిగా ఇక్కడకు వచ్చారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన అలోక్ అరాధే తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
Administered the oath of office to Hon'ble #Telangana High Court Chief Justice Shri.Alok Aradhe at Raj Bhavan #Hyderabad.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) July 23, 2023
Alongside Hon'ble @TelanganaCMO Shri. K.Chandrasekhar Rao,Hon'ble High Court Judges,Senior Advocates,Hon'ble Ministers,MPs MLAs & Officials.@PMOIndia… pic.twitter.com/9QVmYMlAv3
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్ అరాధేను నియమించారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు తర్వాత జస్టిస్ అరాధే ఆరో ప్రధాన న్యాయమూర్తిగా ఇక్కడకు వచ్చారు.
ఛత్తీస్ ఘఢ్ లోని రాయ్ పూర్ అలోక్ అరాధే జన్మస్థలం. 1988 జులై 12న న్యాయవాదిగా తన ప్రస్థానం ప్రారంభించారు అలోక్. 2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2016, సెప్టెంబర్ 16న జమ్ముకాశ్మీర్ న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2018లో జమ్ముకాశ్మీర్ హైకోర్టుకి తాత్కాలిక సీజేగా బాధ్యతలు నిర్వహించారు. 2018, నవంబర్ 17 నుంచి కర్నాటక హైకోర్టు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలం కర్నాటక తాత్కాలిక సీజేగా కూడా పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్డు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు అలోక్ అరాధే.