మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే..
మంత్రిని, ముఖ్యమంత్రిని మానసిక ఆరోగ్య నిపుణిడి వద్దకు లేదా రీహాబిటేషన్ సెంటర్లకు ట్రీట్మెంట్‌కు పంపించాలని కేటీఆర్ ట్వీట్
రాష్ట్రంలో మూసీ సుందరీకరణపై అధికార, విపక్షాలపై మాటల యుద్ధం నడుస్తున్నది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన బాట పట్టారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కార్యాలాయానికి వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ నేతలు కూడా బాధితుల వద్దకు వెళ్లి వారికి భరోసా ఇస్తున్నారు. బుల్జోజర్లు మీ ఇండ్ల మీదికి రావాలంటే ముందు మమ్మల్ని దాటి రావాలని, మీకు అండగా ఉంటామని కలిసికట్టుగా ప్రభుత్వ దుశ్చర్యలను అడ్డుకుందామని పిలుపునిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లు కూల్చి ఎలా ముందుకెళ్తారు తాము చూస్తామని సవాల్ చేస్తున్నారు. మరోవైపు సుందరీకరణ చేసి తీరుతామని అధికార కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మూసీ సుందరీకరణపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ట్వీట్ చేశారు. 'మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే.. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షలన్న కోట్లు ఖర్చు ఎందుకు? మంత్రికి లీగల్ నోటీసులు పంపాము. కాంగ్రెస్ అసహ్యకరమైన, విసుగు పుట్టించే రాజకీయాలు చేస్తున్నది. మంత్రిని, ముఖ్యమంత్రిని మానసిక ఆరోగ్య నిపుణిడి వద్దకు లేదా రీహాబిటేషన్ సెంటర్లకు ట్రీట్మెంట్‌కు పంపించాలని రాహుల్ గాంధీకి అభ్యర్థ' అంటూ కేటీఆర్ ట్విటర్‌లో రాసుకొచ్చారు.