Telugu Global
Telangana

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

నేటి నుంచి 27 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెయిన్స్‌ పరీక్షలు

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సర్వం సిద్ధం
X

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు కోసం సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 1.30 వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు హాల్‌ టికెట్, ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తేవాలని సూచించారు. 31,383 మంది అభ్యర్థులు గ్రూప్‌-1 మెయిన్స్‌ రాయనున్నారు. పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితులను కలెక్టర్లు, పోలీసు అధికారులు పరిశీలించారు.పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. బయోమెట్రిక్‌ ను మొదట తీసుకుంటామన్నారు. అలాగే కోర్టు విధించిన నియమ నిబంధనలను పాటిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.హైదరాబాద్‌ సహా మొత్తం 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఎవరైనా గుమ్మిగూడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు.

కేటీఆర్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు

గ్రూప్‌-1 మెయిన్స్‌, అభ్యర్థుల ఆందోళన దృష్ట్యా బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్నకేటీఆర్‌ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పలువురు బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు.

First Published:  21 Oct 2024 12:11 PM IST
Next Story