కాంగ్రెస్ గూటికి అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే..?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసిన అబ్రహం.. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్‌పై 6 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో అసంతృప్తికి లోనైన అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసిన అబ్రహం.. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్‌పై 6 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా అబ్రహంకే సీఎం కేసీఆర్ టికెట్ ప్రకటించినప్పటికీ.. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గం అభ్యంతరం తెలపడంతో ఆయనకు బీఫామ్ ఇవ్వలేదు. అబ్రహం స్థానంలో విజయుడికి టికెట్ ఇవ్వాలని చల్లా వర్గం పట్టుబట్టింది. దీంతో అలంపూర్ టికెట్‌పై చివరివరకు సస్పెన్స్ కొనసాగింది.
అయితే చివరకు చల్లా వర్గం తన పంతం నెగ్గించుకుంది. విజయుడికే బీఫామ్ అందించారు కేసీఆర్. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన అబ్రహం.. కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.