ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ..!
అక్బరుద్దీన్‌తో పాటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరు సార్లు గెలిచారు. కాంగ్రెస్‌లో ఆరు సార్లు గెలిచిన ఉత్తమ్, తుమ్మల ఇద్దరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరగబోయే తెలంగాణ తొలి శాసనసభ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ప్రమాణస్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
సాధారణంగా ఎక్కువసార్లు అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తులను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ప్రస్తుత సభలో అత్యధికంగా కేసీఆర్ 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆయన సభకు వచ్చే అవకాశాలు లేవు. దీంతో MIM లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
అక్బరుద్దీన్‌తో పాటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరు సార్లు గెలిచారు. కాంగ్రెస్‌లో ఆరు సార్లు గెలిచిన ఉత్తమ్, తుమ్మల ఇద్దరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.