Telugu Global
Telangana

ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ మార్పు

ఆరాంఘర్‌-బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైన్‌ను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం

ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ మార్పు
X

ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆరాంఘర్‌-బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైన్‌ను ఖరారు చేసింది. కారిడార్‌-4లో నాగోల్‌-శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపింది. ఎయిర్‌పోర్టు కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు భూగర్భ మార్గంలో వెళ్లున్నది.

మరోవైపు రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయంతో ఫ్యూచర్‌ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అలాగే మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం పంపనున్నారు. మొత్తం 116.2 కిలోమీటర్లలో రెండో దశ పనులు చేపట్టనున్నారు. రూ. 32, 237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ పనులు జరగనున్నాయి. ఈ దశలో కొత్త ఫ్యూచర్‌ సిటికీ మెట్రో రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు.

మొదటి దశలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో నడుస్తున్నది. రెండో దశలో మరో ఆరు కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర మెట్రో ప్రయాణించనున్నది. రెండో దశ పూర్తయితే మొత్తం తొమ్మిది కారిడార్లలో 185 కిలోమీటర్లు మెట్రో పరుగులు తీయనున్నది.

First Published:  29 Sept 2024 3:19 PM IST
Next Story