అశోక్‌నగర్‌లో గ్రూప్స్-1 అభ్యర్థుల ఆందోళన
ప్రిలిమ్స్ పరీక్షలో జరిగిన తప్పులు, జీవో 29ని సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్
BY Raju Asari16 Oct 2024 11:42 PM IST

X
Raju Asari Updated On: 16 Oct 2024 11:42 PM IST
అశోక్‌నగర్‌లో గ్రూప్స్ అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రిలిమ్స్ పరీక్షలో జరిగిన తప్పులు, జీవో 29ని సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. 10 మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం
Next Story