Telugu Global
Telangana

ఆ కోటలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న.. అద్దంకి దయాకర్

ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్టు అద్దంకి దయాకర్ తన మనసులోని మనోగతాన్ని బయటపెట్టారు

ఆ కోటలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న.. అద్దంకి దయాకర్
X

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్టు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తన మనుసులో మటాను బయటపెట్టారు. దానిపై పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని తోల్కట్టలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తున్నారనే వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నా విషయం తెలిసిందే.

ఫామ్‌హౌస్‌ వివాదంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ స్పందించారు. ఫామ్‌హౌస్‌ తనదేనని.. రమేష్‌ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. ఫామ్‌హౌస్‌ కోడిపందాల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఫామ్‌కు యజమానికిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా కూడా చేర్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు తెలిపారు.

First Published:  13 Feb 2025 6:11 PM IST
Next Story