టికెట్ నిరాకరించిన తర్వాత అద్దంకి రియాక్షన్
తనకు టికెట్ రాలేదని ఎవరు బాధపడొద్దన్నారు. పార్టీకి, ఏ నాయకుడికి ఇబ్బంది కలిగించే విధంగా కామెంట్స్ చేయోద్దని సూచించారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసారు అద్దంకి.
తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. అన్ని రకాల విశ్లేషణల తర్వాత గెలుపే లక్ష్యంగా తుంగతుర్తి విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయమే తనకు శిరోధార్యమని ప్రకటించారు. నిఖార్సైన కార్యకర్తగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానన్నారు. తుంగతుర్తి అభ్యర్థి మందుల శామ్యూల్ నామినేషన్‌కు హాజరవుతానని, గెలుపు కోసం కృషి చేస్తానని వీడియో విడుదల చేశారు. తనకు టికెట్ రాలేదని ఎవరు బాధపడొద్దన్నారు. పార్టీకి, ఏ నాయకుడికి ఇబ్బంది కలిగించే విధంగా కామెంట్స్ చేయోద్దని సూచించారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసారు అద్దంకి.
"పార్టీ నిర్ణయమే ప్రధానం మరియు నేను దానిని అంగీకరిస్తున్నాను.
— Telangana Congress (@INCTelangana) November 9, 2023
రేపు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కు నేను హాజరవుతాను & పార్టీని గెలిపించడానికి కృషి చేస్తా."
: అద్దంకి దయాకర్ గారు. pic.twitter.com/unPMA83qHt
అద్దంకి దయాకర్ తుంగతుర్తి టికెట్ ఆశించారు. అయితే గురువారం రాత్రి కాంగ్రెస్ రిలీజ్ చేసిన చివరి జాబితాలో తుంగతుర్తి టికెట్‌ను మందుల శామ్యూల్‌కు కేటాయించింది. 2014, 2018 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసిన అద్దంకి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక అద్దంకి నియోజకవర్గంలో ఉండడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ పెద్దలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ మందుల శామ్యూల్‌కు టికెట్ ఇచ్చింది.
ఇక అద్దంకి దయాకర్ టికెట్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడ్డుపడ్డారని సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి అద్దంకి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనకు టికెట్ రాకుండా చేశాయని చర్చించుకుంటున్నారు.