Telugu Global
Telangana

కాస్ట్యూమ్స్ మార్చి కనికట్టు.. కటకటాల వెనక్కు హేమ

పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, కోర్టుముందు హాజరు పరిచారు. న్యాయస్థానం రెండు వారాల రిమాండ్ విధించడంతో హేమ.. కటకటాల వెనక్కు వెళ్లాల్సి వచ్చింది.

కాస్ట్యూమ్స్ మార్చి కనికట్టు.. కటకటాల వెనక్కు హేమ
X

బెంగళూరు పోలీసులు ఎన్నో రేవ్ పార్టీలపై రైడ్ చేసి ఉంటారు, చాలామందిని అరెస్ట్ చేసి ఉంటారు, తప్పించుకుని పారిపోయిన వారిని కూడా వెంటాడి పట్టుకుని ఉంటారు. కానీ వారికి తొలిసారిగా షాకిచ్చారు తెలుగు సినీ నటి హేమ. ఆ షాక్ నుంచి తేరుకోడానికి వారికి కొన్నిరోజుల టైమ్ పట్టింది. చివరకు మెడికల్ టెస్ట్ కి ఆమె బురఖాలో వచ్చి కవర్ చేయాలనుకున్నారు. కొత్త కాస్ట్యూమ్స్ చూసి పోలీసులు మళ్లీ షాకయ్యారు. బురఖా తొలగించి ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కోర్టు ఆమెకు 14రోజుల రిమాండ్ విధించింది.

బుకాయింపుల్లో తగ్గేదే లేదు..

రేవ్ పార్టీ జరిగిన రోజు, అదే ఫామ్ హౌస్ నుంచి వీడియో తీసి బెంగళూరుని, హైదరాబాద్ గా మార్చేసి ఓ రేంజ్ లో హై డ్రామా నడిపారు సినీ నటి హేమ. అప్పటి నుంచే ఆమెకు మహా నటి అని సోషల్ మీడియాలో పేరు పడిపోయింది. మీడియాను కూడా కొన్నిగంటలపాటు విజయవంతంగా తప్పుదారి పట్చించింరామె. ఆ తర్వాత మరికొందరు నటులు.. తాము రేవ్ పార్టీకి వెళ్లలేదు ఇంట్లోనే ఉన్నామని చెప్పుకోడానికి సాక్ష్యాలు, రుజువులు కూడా చూపించాల్సి వచ్చిందంటే, అది హేమ ఎఫెక్టే. ఆ రేంజ్ లో ఫేక్ వీడియోతో సోషల్ మీడియాని హడలగొట్టారు హేమ. చివరకు కటకటాల వెనక్కు వెళ్లింది.

బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైన 100మందిలో మొత్తం 86మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలగా.. అందులో హేమ కూడా ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు. అయితే ఆమె అరెస్ట్ విషయంలో కూడా హైడ్రామా నడిచింది. మే-27న నోటీసులివ్వగా, తాను అనారోగ్యంగా ఉన్నానని, విచారణకు రాలేనని ఆమె సమాధానమిచ్చారు. జూన్-1 కూడా ఆమె విచారణకు రాలేదు. చివరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, కోర్టుముందు హాజరు పరిచారు. న్యాయస్థానం రెండు వారాల రిమాండ్ విధించడంతో హేమ.. కటకటాల వెనక్కు వెళ్లాల్సి వచ్చింది.

First Published:  4 Jun 2024 6:47 AM IST
Next Story