Telugu Global
Telangana

పాడిందే పాడరా అన్నట్టు 82 ప్రశ్నలు అడిగిండ్రు

రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎవరూ గుర్తిస్తలేరు : కేటీఆర్‌

పాడిందే పాడరా అన్నట్టు 82 ప్రశ్నలు అడిగిండ్రు
X

పాడిందే పాడరా అన్నట్టుగా ఏసీబీ వాళ్లు తనను విచారణలో 82 ప్రశ్నలు అడిగారని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు మద్దతుగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి అభివాదం చేశారు. ఈ కేసులో విషయం లేదని, రేవంత్‌ రెడ్డి తమతో బలవంతంగా కేసు పెట్టించాడు అన్న ఫీలింగ్‌ ఏసీబీ వాళ్లకు కూడా ఉందన్నారు. ''గలీజ్‌ పనులు రేవంత్‌ రెడ్డి చేస్తడు తప్ప మాకు ఆ ఖర్మ పట్టలేదు అని ఏసీబీ వాళ్లకు చెప్పిన.. ఇట్లాంటి కేసులు వంద పెట్టినా ఎదుర్కొంటాం.. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా పని చేశాం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. ఇండ్ల కేసు లేదు.. పీసు లేదు.. ఇదో లొట్టపీసు కేసు మాత్రమే అవినీతి ఎక్కడ జరిగింది అంటే వాళ్లు నీళ్లు మింగుతున్నారు.. నువ్వు జైలుకు పోయినవు కాబట్టి అందరిని జైలుకు పంపాలని చూస్తున్నవు.. రేవంత్‌ రెడ్డిని ఎవడూ ముఖ్యమంత్రిగా గుర్తే పడతలేడు.. సంవత్సరం తర్వాత కూడా నిన్ను ఎవడు దేకపోతే నేనేం చేయాలే.. కనకపు సింహాసమున శునకం కూర్చోబెడితే అని ఎప్పుడో చెప్పిండ్రు.. నిజాయితీకి ధైర్యం ఎక్కువ.. అదో లొట్టపీసు కేసు.. వాడో లొట్టపీసు ముఖ్యమంత్రే.. రేవంత్‌ రెడ్డి క్వశ్చనీర్‌ పంపితే మళ్లీ విచారణకు పిలుస్తరేమో.. ఎన్నిసార్లు పిలిచినా పోత.. వాళ్లు అడిగిన దానికి సమాధానం చెప్తాం.. రేవంత్‌ రెడ్డి ఒక లుచ్చగాడు.. దొంగ.. గాయనలెక్క మేం లుచ్చ పనులు చేయమని ఏసీబీ వాళ్లకు చెప్పిన.. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో.. ఈ కేసులో అవినీతి అంతే.. వాళ్లు ఫైలు అటు నుంచి ఇటు పోయింది.. ఇటు నుంచి అటుపోయింది నీకు తెలుసా అడిగారు.. మంత్రిగా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు ఈ రేసు ఇక్కడ్నే ఉండాలని నేను కోరుకున్న అని చెప్పిన..'' అని వివరించారు.

First Published:  9 Jan 2025 6:25 PM IST
Next Story