Telugu Global
Telangana

ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వీసీ.. - సంబరాల్లో విద్యార్ధులు

ఇంట్లో దాదాపు 8 గంట‌ల పాటు సోదాలు నిర్వ‌హించిన అనంత‌రం ర‌వీంద‌ర్ గుప్తాను అరెస్టు చేస్తున్న‌ట్లు ఏసీబీ అధికారులు ప్ర‌క‌టించారు. వెంటనే ర‌వీంద‌ర్ గుప్తాను ఏసీబీ అధికారులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వీసీ.. - సంబరాల్లో విద్యార్ధులు
X

తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా ఏసీబీకి పట్టుబడ్డారు. నిజామాబాద్ జిల్లా ప‌రిధిలోని భీమ్‌గ‌ల్‌లో ప‌రీక్షా కేంద్రం ఏర్పాటుకు వీసీ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. వీసీ అడిగిన మొత్తాన్ని నిర్వాహకులు హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో అంద‌జేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంట్లో దాదాపు 8 గంట‌ల పాటు సోదాలు నిర్వ‌హించిన అనంత‌రం ర‌వీంద‌ర్ గుప్తాను అరెస్టు చేస్తున్న‌ట్లు ఏసీబీ అధికారులు ప్ర‌క‌టించారు.

వెంటనే ర‌వీంద‌ర్ గుప్తాను ఏసీబీ అధికారులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ తర్వాత ఏసీబీ కోర్డు మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు. గతకొన్ని రోజులుగా నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో పాలకమండలికి, వీసీకి మధ్య వివాదం జరిగింది. అయితే వర్సిటీలో పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండటంతో వీసీ వెనక్కి తగ్గారు.

రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఇది జరిగిన మరుసటి రోజే వీసీ రవీందర్‌ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడ్డారు. వీసీ ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డడంతో విద్యార్థులు తెలంగాణ యూనివ‌ర్సిటీలో సంబరాలు చేసుకున్నారు.

First Published:  17 Jun 2023 3:55 PM GMT
Next Story